ఎన్నికలయ్యే వరకు ‘మందిరం’ ఊసెత్తం: వీహెచ్‌పీ

VHP Defers Ram temple Agitation By four months - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) చేపట్టిన ఉద్యమం తాత్కాలికంగా ఆగింది. ‘రామమందిర నిర్మాణ అంశం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రబిందువుగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక మా భవిష్యత్‌ కార్యచరణను వెల్లడిస్తాం’ అని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ చెప్పారు.

అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించేందుకు వీలుగా బీజేపీ సర్కారు పార్లమెంటులో చట్టం తేవాలనే డిమాండ్‌తో వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా ‘రామజన్మభూమి ఉద్యమం’ను ఉధృతం చేయడం తెల్సిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తూ, అన్ని పార్టీల ముఖ్యనాయకులను వీహెచ్‌పీ నేతలు కలుస్తున్నారు.

నరేంద్ర మోదీ సర్కారుకు ఇబ్బందులు రాకూడన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు   వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తెలిపారు. తమకు బీజేపీ మినహా ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top