నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై మే 26 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై మే 26 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ యూపీలోని సహరన్పూర్ నుంచి ప్రారంభిస్తారని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... ప్రతిరాష్ట్రంలో కనీసం ఆరు బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణపాఠం నేర్చుకోవడం లేదని వెంకయ్య విమర్శించారు.