మరిన్ని సుప్రీం బెంచ్‌లు అవసరం | Venkaiah coments on Supreme Court Benches in four regions | Sakshi
Sakshi News home page

మరిన్ని సుప్రీం బెంచ్‌లు అవసరం

Dec 19 2019 3:05 AM | Updated on Dec 19 2019 3:05 AM

Venkaiah coments on Supreme Court Benches in four regions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. బుధవారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘విభిన్న రంగాల్లో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. కక్షిదారుల వ్యయప్రయాసలను తగ్గించేందుకు, సత్వర న్యాయం అందే దిశగా, దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో సుప్రీం కోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలి. రాజకీయ నేతలపై క్రిమినల్‌ కేసుల విషయంలో వేగం అవసరం. ఫిరాయింపులకు పాల్పడినవారిపై పరిమిత కాలంలో నిర్ణయం తీసుకోవాలి. రాజ్యసభలో సభ సజావుగా జరగని సందర్భాల కంటే నిర్మాణాత్మక చర్చలను మీడియా చూపించాలి’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement