ఆటోడ్రైవర్ సాహసం | Vadodara auto driver saves teen from crocodile's jaws | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్ సాహసం

Oct 8 2015 2:18 PM | Updated on Sep 3 2017 10:39 AM

మృత్యుకోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న యువకుడిని గుజరాత్ లో ఓ ఆటోడ్రైవర్ అత్యంత సాహసంతో రక్షించాడు.

వడోదర: మృత్యుకోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న యువకుడిని గుజరాత్ లో ఓ ఆటోడ్రైవర్ అత్యంత సాహసంతో రక్షించాడు. వడోదరాకు చెందిన ఆటోడ్రైవర్ గనిభాయ్ మహమ్మద్ షేక్ (52)  మొసలి నోట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ముఖేష్ శుక్లాను సమయస్ఫూర్తిగా రక్షించి రియల్ హీరోగా నిలిచాడు.

మధ్యప్రదేశ్ కు చెందిన ముఖేష్ (17) స్థానిక విశ్వామిత్ర నదిలో  పడిపోయాడు.  నదిలో  ఉన్న మొసలి అతగాణ్ని దొరకబుచ్చుకుంది.   యువకుడి  ఎడమ చేయి దాని కోరల్లో చిక్కుకుని నలిగిపోతోంది.. ముఖేష్ బాధతో విలవిల్లాడుతూ సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. చుట్టు గుమిగూడిన జనం రాళ్లు, కర్రలతో మొసలిని కొడుతూ ఆ  యువకుడిని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దారిన పోతున్న  మహమ్మద్  షేక్... అరుపులు, కేకలు విని ఆక్కడకు చేరాడు. మృత్యువుతో పోరాడుతున్న యువకుడ్ని చూశాడు. అంతే పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర నుంచి ఒక ఇనుప రాడ్ తెచ్చి మొసలిని కొట్టడం మొదలు పెట్టాడు. మొసలి తోక ముడిచేదాకా తన ప్రయత్నాన్ని ఆపలేదు. దాదాపు  15-20 నిమిషాల తరువాత యువకుడి చేతిని వదిలి పెట్టి మొసలి నీళ్లలోకి జారుకుంది. బాధితుడిని ఒడ్డుకు చేర్చిన జనం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అటవీ అధికారి పీబీ చవాన్ తెలిపారు. బాధితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అసలు నదిలో అతను ఎలా పడ్డాడో విచారిస్తున్నామని తెలిపారు. అయితే  బ్రిడ్జిపై నుంచి ఆ యువకుడే నదిలో దూకినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. మరోవైపు ఈ నదిలో దాదాపు  100- 200 మొసళ్లు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement