ఉత్తరాఖండ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు

Uttarakhand Bus Falls Into Deep Gorge - Sakshi

డెహ్రడూన్‌ : ఉత్తరాఖండ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో బస్సు లోయలో పడిపోయి ఇద్దరు మృతి చెందగా.. మరో చోట కారు యాక్సిడెంట్‌లో ఒకరు మరణించారు. బస్సు ప్రమాద సంఘటన పూరి జిల్లా ఖాబ్ర గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. బస్సు ఓ లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కారు యాక్సిడెంట్‌ చమోలీ జిల్లా కుంజో గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top