కలుసుకోమని కాల్‌ చేశాడు.. అంతలోనే..!

Uttar Pradesh Migrant Worker Found Dead In Shramik Train Toilet - Sakshi

లక్నో: నిద్రాహారాలు లేక ఫ్లాట్‌ఫామ్‌పైనే ప్రాణాలు వదిలిన బిహార్‌ మహిళా వలస కూలీ ఉదంతం మరువకముందే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో ప్రాణాలు విడిచాడు. ఇంకో 70 కిలోమీటర్లు చేరితే ఇల్లు చేరుతానని మురిసిన ఆ వ్యక్తి.. చివరకు రైలు టాయ్‌లెట్‌లో శవమై కనిపించాడు. అయితే, చనిపోయిన ఐదు రోజుల వరకూ అతని మృతదేహం ఎవరికంటా బయటపడకపోవడం మరో విషాదం.
(చదవండి: ఆ పదం తొలగించే అవకాశం ఉంటుందా?)

వివరాలు.. రాష్ట్రంలోని బస్తీ జిల్లాకు చెందిన మోహన్‌ లాల్‌ శర్మ (38) ముంబైలో రోజూ కూలీ చేసే కార్మికుడు. అందరిలాగే అతనికీ కరోనా లాక్‌డౌన్‌తో దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో శ్రామిక్‌ రైలులో ఇంటికి బయల్దేరాడు. అందరితోపాటు మే 23న ఝాన్సీకి చేరుకున్నాడు. అనంతరం ఝాన్సీ జిల్లా యంత్రాంగం శ్రామిక్‌ రైలులో వచ్చిన వారిని ఆయా ప్రాంతాలకు వెళ్లే స్థానిక రైళ్లలో ఎక్కించింది. ఈ క్రమంలో శర్మ తన బంధువొకరికి కాల్‌ చేసి.. తనను గోరఖ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో కలుసుకోవాలని కోరాడు. అయితే, ఆ బంధువు మే 24న శర్మ ఫోన్‌కు కాల్‌ చేయగా.. స్విచ్డ్‌ ఆఫ్‌ వచ్చింది. గోరఖ్‌పూర్‌లో ప్రయాణికులను దించిన తర్వాత రైలు మే 27న తిరిగి ఝాన్సీకి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం రైల్వే కోచ్‌లు శుభ్రం చేస్తున్న క్లీనింగ్‌ సిబ్బంది రైలు టాయ్‌లెట్‌లో శర్మ శవం చూసి షాక్‌కు గురయ్యారు.

పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఝాన్సీలో ప్రయాణికులను దించిన తర్వాత.. టాయ్‌లెట్‌లో పడిపోయిన శర్మను ఎవరూ చూడలేదని అధికారులు తెలిపారు. శర్మకు కోవిడ్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే శ్రామిక్‌ రైలులో అనుమతించామని చెప్పారు. అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడి కాలేదని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో.. ఎవరూ అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం లేదని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత శర్మ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, గడిచిన రెండు నెలల్లో దాదాపు 20 లక్షల వలస కార్మికులు సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు.
(చదవండి: 'ఆ ఘటన కలచివేసింది.. నిజంగా దురదృష్టకరం')

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-07-2020
Jul 06, 2020, 04:20 IST
బెర్లిన్‌: కరోనా బాధితులకు యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పెద్దగా ఉపయోగం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. బాధితులకు...
06-07-2020
Jul 06, 2020, 04:17 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారినపడ్డ వారిలో 8,422 మంది రికవరీ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో...
06-07-2020
Jul 06, 2020, 04:15 IST
గువాహటి: కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలోనే.. మత ప్రబోధకుడి అంత్యక్రియలకు వేలాదిగా జనం హాజరు కావడంతో అస్సాం ప్రభుత్వం...
06-07-2020
Jul 06, 2020, 04:09 IST
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ వ్యాప్తి నానాటికీ విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం...
06-07-2020
Jul 06, 2020, 04:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తికి, ప్రపంచవ్యాప్తంగా అది సృష్టించిన మారణహోమానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి...
06-07-2020
Jul 06, 2020, 03:51 IST
మొదటి లక్ష టెస్టులకు 59 రోజుల సమయం పడితే 10వ లక్ష టెస్టులు చేయడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టింది.  చివరి...
06-07-2020
Jul 06, 2020, 02:23 IST
కూకట్‌పల్లిలో  ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. హోం క్వారం టైన్‌లో ఉండి చికిత్స పొందుతా నన్న అతను.....
06-07-2020
Jul 06, 2020, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,590 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 5,290 మందికి పరీక్షలు నిర్వహించగా,...
06-07-2020
Jul 06, 2020, 02:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగులపై ప్రైవేటు ఆస్ప త్రులు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. అసలు మందే లేని కరోనాకు చికిత్స పేరుతో...
06-07-2020
Jul 06, 2020, 01:55 IST
గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌  ఆసుపత్రిలో  నిమ్మ బస్వ నాగరాజు (42) కరోనాతో గత నెల 25న చేరి ఈ...
05-07-2020
Jul 05, 2020, 21:53 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 1590 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి....
05-07-2020
Jul 05, 2020, 20:14 IST
న్యూఢిల్లీ : కరోనాను అంతం చేయడంలో దేశీయ వ్యాక్సిన్లు ఏ విధంగా పోటీలో ఉన్నాయో తెలుపుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక...
05-07-2020
Jul 05, 2020, 20:11 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఘోరంగా విఫలమయ్యారని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట‌ రెడ్డి...
05-07-2020
Jul 05, 2020, 19:43 IST
కోవిడ్‌-19 నుంచి కోలుకున్న 106 ఏళ్ల వృద్ధుడు
05-07-2020
Jul 05, 2020, 19:37 IST
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్(70) కరోనా వైరస్‌ బారిన...
05-07-2020
Jul 05, 2020, 18:58 IST
జైపూర్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ ప్రభుత్వం కీలక...
05-07-2020
Jul 05, 2020, 18:41 IST
తిరువనంతపురం: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని దీటుగా నిలువరించేందుకు కోవిడ్‌-19 నిబంధనలను...
05-07-2020
Jul 05, 2020, 18:38 IST
సాక్షి, విశాఖపట్నం: కరోనా నేపథ్యంలో పోలీసుల కృషి అభినందనీయమని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా...
05-07-2020
Jul 05, 2020, 18:00 IST
కోవిడ్‌-19పై పోరుకు దేశీ తయారీ ఉత్పత్తులను చేపట్టామన్న డీఆర్‌డీఓ
05-07-2020
Jul 05, 2020, 15:11 IST
సాక్షి, హైదరాబాద్‌ :  ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానాను చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆమెకు ఉచితంగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top