జూన్ 18న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ | UPSC prepones civil services exam; prelims on June 18 | Sakshi
Sakshi News home page

జూన్ 18న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

Feb 24 2017 2:32 AM | Updated on Sep 5 2017 4:26 AM

ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్ 18కి మార్చుతూ యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్  18కి మార్చుతూ యూనియన్  పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల తర్వాత యూపీఎస్సీ జూన్ నెలలో ప్రిలిమ్స్‌ను నిర్వహించనుంది. 2014, 2015, 2016 ల్లో ఆగస్టు నెలలో ప్రిలిమ్స్‌ను నిర్వహించారు.

మొత్తం 980 ఖాళీలకు నిర్వహించనున్న ఈ పరీక్షలో 27 ఖాళీలను దివ్యాంగులకు కేటాయించారు. ప్రిలిమ్స్‌–2017కు మార్చి 17 సాయంత్రం ఆరుగంటల వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని కమిషన్  స్పష్టం చేసింది. మెయిన్స్  పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement