కేరళ ఆరోగ్య మంత్రికి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు

UN Praises Kerala Health Minister KK Shailaja For Tackling Corona Effectively - Sakshi

తిరువనంతపురం : కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో కేరళ కృషిని ఐక్యరాజ్య సమితి కొనియాడింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజతో పాటు ఇతర నాయకులను ప్రశంసించింది. మంగళవారం పబ్లిక్‌ సర్వీస్‌ డేను పురస్కరించుకుని కరోనాను ఎదుర్కోవటంతో ప్రపంచ వ్యాప్తంగా విశేష కృషి చేసిన వారిని ఐక్యరాజ్య సమితి అభినందించింది. ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ( ‘కరోనా’తో సైరస్‌ సంపదకు రెక్కలు! )

ఈ సందర్భంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ.. ‘‘నిఫా వైరస్‌, 2018-19 సంవత్సరాలలో వచ్చిన రెండు వరదలను ఎదుర్కోవటంలో ఆరోగ్య శాఖ కీలక పాత్రను పోషించింది. ఆ అనుభవమే కోవిడ్‌-19 నియంత్రణ కోసం ఉపయోగపడింది. వూహాన్‌లో కరోనా కేసులు నమోదైన వెంటనే కేరళ అప్రమత్తం అయింది. తగిన విధంగా చర్యలు తీసుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రేటు 12.5, మరణాల రేటు 0.6గా ఉంది’’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top