ఎంపీలుగా ఆ ముగ్గురి ప్రమాణం..

Two Sp, One Rjd mps Oath In Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు సభ్యులు శుక్రవారం ఉదయం లోక్‌సభలో ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయనడానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని భావిస్తున్న నేపథ్యంలో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం ప్రాధాన్యం సంతరించుకుంది. సభికుల హర్షద్వానాల మధ్య తొలుత ఆర్జేడీ నుంచి గెలుపొందిన సర్ఫ్‌రాజ్‌ ఆలం ఎంపీగా ప్రమాణం చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ల నుంచి విజయం సాధించిన సమాజ్‌వాదీ అభ్యర్థులు ప్రవీణ్‌కుమార్‌ నిషాద్‌, నాగేంద్ర పటేల్‌ సింగ్‌ పాటిల్‌ లు ప్రమాణం చేశారు. వీరంతా హిందీలో తమ ప్రమాణ పాఠాన్ని చదవడం విశేషం.

పార్టీ టోపీలు ధరించి ఎంపీలుగా..
సమాజ్‌వాది పార్టీ సంప్రదాయ ఎరుపు రంగు టోపీలను ధరించి ప్రవీణ్‌కుమార్‌‌, నాగేంద్ర పటేల్‌లు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ సీనియర్‌ నాయకుడు అద్వానీ, ఏఐసీసీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top