ఛత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు.
రాయ్ పూర్: ఎనిమిది నక్సల్ ను పోలీసులు మట్టుపెట్టిన గంటల వ్యవధిలోనే ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మళ్లీ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఈసారి మావోయిస్టులు భద్రతాబలగాలకు నష్టంచేశారు.
నక్సల్స్ ఏరివేతలో భాంగా సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సుక్మా జిల్లాలోని అటవీప్రాంతంలో గురువారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బమరక వద్ద ఒకరికొకరు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్, కోబ్రా-208 దళాలకు చెందిన ఇద్దరు జవాన్లు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.