ట్రిపుల్‌ తలాక్‌ బాధితురాలికి యోగి అభయం

Triple Talaq Victim Reaches Yogi's 'Janta Darbar - Sakshi - Sakshi

సాక్షి, గోరఖ్‌పూర్‌ : ట్రిపుల్‌ తలాఖ్‌ బాధితురాలికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అండగా నిలిచారు. యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం గోరఖ్‌పూర్‌ మఠంలో జనతా దర్బార్‌ నిర్వహించారు. ఈ సమయంలో రాంపూర్‌కు చెందిన బాధిత ముస్లిం మహిళ.. ట్రిపుల్‌ తలాఖ్‌ గురించి ఆయనకు వివరించారు. ‘నాకు నాభర్త ఫోన్‌లోనే తలాక్‌.. అని ముమ్మారు చెప్పి విడాకులు ఇచ్చారని’  ఆమె వాపోయారు. విడాకులు ఇవ్వడమేకాక.. తనను చంపుతానని బెదిరించినట్లు బాధితురాలు అతియా బేగం యోగి ఆదిత్యనాథ్‌కు వివరించారు.

అతియా బేగం ఆవేదనపై స్పందించిన యోగి ఆదిత్యానాథ్‌.. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత మహిళకు తప్పకుండా న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలపై దురాగతాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top