ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్గుప్తా మృతి

అరిందమ్ సేన్గుప్తా (ఫైల్ ఫోటో)


న్యూఢిల్లీ : ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్గుప్తా కేన్సర్తో గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. గత 33 ఏళ్లుగా ఆయన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో అరిందమ్ సేన్గుప్తా ది పేట్రియాట్, ది సండే అబ్జర్వర్, ది ఎకనామిక్ టైమ్స్లో పని చేశారు. ఎస్టీ స్టిఫెన్స్ కాలేజీలో ఎంఏ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు.


అరిందమ్ సేన్గుప్తా ప్రస్తుతం టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అరిందమ్ మృతిపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top