నేడు పీఎస్‌ఎల్వీ సీ38 కౌంట్‌డౌన్‌ | Today is PSLV C 38 Countdown | Sakshi
Sakshi News home page

నేడు పీఎస్‌ఎల్వీ సీ38 కౌంట్‌డౌన్‌

Jun 22 2017 4:07 AM | Updated on Sep 5 2017 2:08 PM

నేడు పీఎస్‌ఎల్వీ సీ38 కౌంట్‌డౌన్‌

నేడు పీఎస్‌ఎల్వీ సీ38 కౌంట్‌డౌన్‌

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్‌ నుంచి శుక్రవారం నిర్వహించనున్న పీఎస్‌ఎల్వీ సీ38 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌ డౌన్‌ను గురువారం ఉదయం 5.29కి ప్రారం భించనున్నారు.

శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్‌ నుంచి శుక్రవారం నిర్వహించనున్న పీఎస్‌ఎల్వీ సీ38 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌ డౌన్‌ను గురువారం ఉదయం 5.29కి ప్రారంభించనున్నారు. బుధవారం దీనికి సంబంధిం చిన మిషన్‌ సంసిద్ధత సమావేశాన్ని నిర్వహిం చారు. లాంచ్‌ రిహార్సల్స్‌ నిర్వహించి కౌంట్‌ డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా ప్రకటించారు.

28 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం శుక్రవారం ఉదయం 9.29కి  రాకెట్‌ను ప్రయోగిస్తారు. దీని ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌ 2డీ, దేశీయ వర్సిటీకి చెందిన ఓ చిన్న ఉపగ్రహంతో పాటు 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తారు. గురువారం ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ షార్‌ చేరుకుని రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement