
పాస్‌పోర్ట్‌కు ఇక హిందీలోనూ..
ఇకపై పాస్‌పోర్టు కోసం హిందీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దీంతో అన్ని పాస్‌పోర్టు కార్యాలయాల్లో రెండు భాషలలో దరఖాస్తులను అందుబాటులోకి తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. అంతేగాక, హిందీలో నింపిన దరఖాస్తును కూడా విదేశాంగ శాఖ ఆమోదించాలని పేర్కొంది. పాస్‌పోర్టులపై కూడా హిందీలో పేర్లను రాయాలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఇటీవలే ఆమోదముద్ర వేశారు. అంతేగాక దేశ కార్యాలయాలు లేదా విదేశాంగ కార్యాలయాలల్లో హిందీ అధికారి పదవిని సృష్టించేందుకు రాష్ట్రపతి అనుమతిచ్చారు. పాస్‌పోర్టు వెబ్‌సైట్ నుంచి హిందీ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, నింపిన తరువాత దరఖాస్తులను తిరిగి వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలని విదేశాంగ శాఖ తెలిపింది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో కాకుండా పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాలలో ఇస్తే అంగీకరించబోమని విదేశాంగశాఖ స్పష్టంచేసింది.