టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న టీఎంసీ | TMC occupies TDP office in parliament | Sakshi
Sakshi News home page

టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న టీఎంసీ

Aug 12 2014 3:18 PM | Updated on Aug 11 2018 4:32 PM

టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న టీఎంసీ - Sakshi

టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న టీఎంసీ

పార్లమెంట్లో టీడీపీ కార్యాలయం విషయంలో వివాదం ఏర్పడింది.

న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీడీపీ కార్యాలయం విషయంలో వివాదం ఏర్పడింది. టీడీపీ ఆఫీసును తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం ముందు తృణమాల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ బోర్డు కూడా ఏర్పాటు చేశారు.

తమకు 40 మంది ఎంపీలున్నారని, టీడీపీకి కేవలం 22 మంది ఎంపీలే ఉన్నందున తమకే ఆ ఆఫీసు ఉపయోగించుకునే అర్హత ఉందని తృణమాల్ ఎంపీలు చెప్పారు. అయితే 30 ఏళ్లుగా తమ పార్టీ ఇదే కార్యాలయాన్ని వాడుకుంటున్నందున తమకే దక్కాలని టీడీపీ ఎంపీలు వాదిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement