ఢిల్లీలో తృణమూల్‌ ఎంపీల ఆందోళన | TMC leaders protest in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో తృణమూల్‌ ఎంపీల ఆందోళన

Jan 4 2017 4:27 PM | Updated on Sep 5 2017 12:24 AM

ఢిల్లీలో తృణమూల్‌ ఎంపీల ఆందోళన

ఢిల్లీలో తృణమూల్‌ ఎంపీల ఆందోళన

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగారు.

న్యూఢిల్లీ: తమ పార్టీ నాయకులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ర్యాలీగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకుని తుగ్లక్‌ రోడ్డు పోలీసు స్టేషన్‌ కు తరలించారు. పోలీస్‌ స్టేషన్ లోనూ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళ్యాణ్‌ బెనర్జీ, సౌగతా రాయ్‌ తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు ఒడిశాలోని భువనేశ్వర్ లో నిన్న అరెస్ట్ చేసిన తృణమూల్‌ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement