
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర పథకం కింద ప్రతి జిల్లాలో ఓ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రకటించారు. ఇందుకోసం 2018–19 బడ్జెట్‌లో రూ.3,400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.2,356.22 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి దేశవ్యాప్తంగా ఇప్పటికే 306 ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.