ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం మళ్లీ కాల్పుల కలకలం రేగింది.
మల్కాన్గిరి : ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కూంబింగ్ పార్టీ పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అలాగే జంత్రీ అటవీప్రాంతంలో కూంబిగ్ కొనసాగుతోంది.
గాయపడి, తప్పించుకున్న మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. కాగా డిసెంబర్ ౩ నుంచి జరగనున్న పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్లీనరీని సోమవారం పోలీసులు ముట్టడించడంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 24మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయస్టుల మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది. మల్కాన్గిరి ఎస్పీ కార్యాలయంలో మృతదేహాలను భద్రపరిచారు. మరికాసేపట్లో ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను తరలించనున్నారు. కాగా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఏపీ డీజీపీ సాంబశివరావు ఏరియల్ సర్వే చేయనున్నారు.