సోదరులు ఫుల్లుగా తాగి.. పట్టాలపై పడుకుని! | Three brothers committed suicide in up | Sakshi
Sakshi News home page

సోదరులు ఫుల్లుగా తాగి.. పట్టాలపై పడుకుని!

Sep 6 2017 8:16 PM | Updated on Sep 17 2017 6:29 PM

సోదరులు ఫుల్లుగా తాగి.. పట్టాలపై పడుకుని!

సోదరులు ఫుల్లుగా తాగి.. పట్టాలపై పడుకుని!

వరుసకు అన్నదమ్ములయ్యే ముగ్గురు యువకులు మద్యం తాగి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.

గ్రేటర్‌ నోయిడా: వరుసకు అన్నదమ్ములయ్యే ముగ్గురు యువకులు మద్యం తాగి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధనగర్‌ జిల్లా బాదల్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దాద్రి సమీపంలోని పట్వారీ గ్రామానికి చెందిన బాలు యాదవ్‌, కపిల్‌ యాదవ్‌, రోహిత్‌ యాదవ్‌ వరుసకు అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం ఈ ముగ్గురూ మద్యం తాగి వారి ఇళ్లకు వెళ్లగా కుటుంబసభ్యులు లోనికి రానివ్వలేదు.

మద్యం మత్తులో ఉన్న ఈ ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నారు. అందుకోసం మళ్లీ మద్యం సేవించారు. అనంతరం రైలు పట్టాలపైకి వెళ్లి పడుకున్నారు. రైలు వారిపై నుంచి వెళ్లటంతో ఈ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వీరిది హత్యా.. లేక ఆత్మహత్యా అని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement