మావోయిస్టులూ.. వెళ్లిపోండి | Thousands join 'Lalkar' rally against Maoists | Sakshi
Sakshi News home page

మావోయిస్టులూ.. వెళ్లిపోండి

Sep 18 2016 10:25 AM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టులకు వ్యతిరేకంగా తొలిసారి గిరిజనులు గళమెత్తారు.

మల్కన్‌గిరి: మావోయిస్టులకు వ్యతిరేకంగా తొలిసారి గిరిజనులు గళమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో పలు సంఘాల ఆధ్వర్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ఏడు జిల్లాల నుంచి 50 వేల మందికి పైగా గిరిజనులు ఇందులో పాల్గొన్నారు.

ఇంతకాలం మావోయిస్టులకు సాయం చేశామని గిరిజన సంఘాల నాయకులు అన్నారు. ప్రతిఫలంగా గిరిజనులను కాల్పుల్లో ముందుంచి వారి మృతికి కారణమవుతున్నారని మండిపడ్డారు.‘ మా బతుకులు మేం దిద్దుకుంటాం మీరు వెళ్లిపోండి’ అని ఎలుగెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement