సినిమాల్లో సీన్‌లా ఒక్కటైన ప్రేమజంట

Thief Becomes Bridegroom In A Dramatical Situation - Sakshi

ఒంటరిగా వెళ్లిన యువకుడు జంటగా ఇంటికి తిరిగొచ్చాడు. ఏది ఏమైతేనేం, ఎన్ని కష్టాలు ఎదురైనా తన ప్రేమను గెలిపించుకుని శభాష్‌ అనిపించుకున్నాడు ఓ ఆర్మీ ఉద్యోగి. అచ్చం సినిమాల్లో సన్నివేశంలాగా జరిగిపోయిన వివాహంపై బిహార్‌లోని తిలౌతులో చర్చించుకుంటున్నారు. 

పట్నా : తిలౌతు పీఎస్‌ పరిధిలోని మహారాజ్‌గంజ్‌ గ్రామానికి చెందిన విశాల్‌ సింగ్‌ అలియాస్‌ తేజు(25) ఆర్మీలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. బరాధికి చెందిన సమీప బంధువు భిఖారి యాదవ్‌ కూతురు లక్ష్మిణ కుమారితో విశాల్‌తో  పరిచయం ప్రేమగా మారింది. గత ఐదేళ్లగా తమ ఇంట్లో తెలియకుండా వీరు రహస్యంగా కలుసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్మీ నుంచి సెలవుపై వచ్చిన విశాల్‌, బుధవారం రాత్రి లక్ష్మి ఇంటికి దొంగచాటున వెళ్లాడు.

లక్ష్మి కుటుంసభ్యులు దొంగగా భావించి విశాల్‌ను పట్టకున్నారు. విశాల్‌ చోరీకి వచ్చాడని అనుమానించి ఓ గదిలో అతడిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతోపాటు విశాల్‌ గ్రామ(మహారాజ్‌గంజ్‌) పెద్దలను సైతం పంచాయితీకి పిలిపించారు. గత కొంతకాలం నుంచి తాము ప్రేమించుకున్నామని విశాల్‌, లక్ష్మీలు బహిర్గతం చేశారు. దీంతో వీరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. గురువారం రోజు వేడుకగా వీరి పెళ్లిని రెండు గ్రామాల ప్రజల సమక్షంలో నిర్వహించారు.

వరుడి తాత హర్షం
వరకట్నం తీసుకోకుండా నా మనవడి పెళ్లి జరిపించాలనుకున్నా. నేడు అదే జరిగింది. మా విశాల్‌ కోరుకున్న అమ్మాయితో వివాహం జరగడం నా సంతోషాన్ని రెట్టింపు చేసిందని వరుడి తాత పంచూ అన్నారు. వధూవరులు మేజర్లు కావడం వల్ల అక్షింతలు వేసి ఆశీర్వదించడం తప్ప.. తాము చేసేదేంలేదన్నారు పోలీసులు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top