
రైతులకు పండుగ కానుక
కొత్త పంట బీమా పథకం రైతుల జీవితాల్లో భారీ మార్పు తీసుకువస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు.
బీమా పథకంపై మోదీ
న్యూఢిల్లీ: కొత్త పంట బీమా పథకం రైతుల జీవితాల్లో భారీ మార్పు తీసుకువస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. ‘రైతు సోదర, సోదరీమణులారా! మీరు లోఢి, పొంగల్, బిహు వంటి పండుగలు జరుపుకునే సమయంలో.. ప్రధానమంత్రి పంట బీమా పథకం రూపంలో ప్రభుత్వం మీకు ఒక కానుక ఇచ్చింది’ అని ఆయన బుధవారం ట్విటర్ వ్యాఖ్యల ద్వారా పేర్కొన్నారు. పంటల బీమా పథకాలు తగినంతమంది రైతులకు ప్రయోజనం కలిగించటంలో విఫలమయ్యాయంటూ.. కొత్తగా ప్రకటించిన పథకం చిన్నకారు రైతులు సహా అన్ని వర్గాల రైతులకూ వర్తించేలా చూడాలని సీపీఎం డిమాండ్ చేసింది.
పార్టీ అనుబంధ రైతు సంస్థ అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి మొల్లా మీడియాతో మాట్లాడుతూ.. ధనిక రైతులే ఇప్పటివరకూ బీమా ప్రయోజనాలు పొందుతున్నారని.. కౌలు రైతులనూ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరారు.