‘నరకంలో ఉన్నాను.. కాపాడండి’ | Tearful Ludhiana woman pleads for help | Sakshi
Sakshi News home page

‘నరకంలో ఉన్నాను.. కాపాడండి’

Dec 26 2017 2:08 PM | Updated on Dec 26 2017 5:15 PM

Tearful Ludhiana woman pleads for help - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘నన్ను మోసం చేశారు. నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను.. దయ చేసినన్ను ఎవరైనా కాపాడండి’ అంటూ 46 ఏళ్ల ఒక మహిళ కన్నీటి ఆక్రందన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లూధియానాకు చెందిన 46 ఏళ్ల కుల్దీప్‌ కౌర్‌ను ట్రావెల్‌ ఏజెంట్‌ మోసం చేశాడు. ప్రస్తుతం కుల్దీప్‌ కౌర్‌.. సౌదీలోని మహమ్మద్‌​ అహ్మద్‌, సారా దంపతుల ఇంట్లో కట్టుబానిసగా పనిచేస్తోంది. 

ఆ ఇంట్లో ఆమె పడుతున్న కష్టాలు, ఇబ్బందులు శత్రువు కూడా పడకూడదని.. ఆమె కన్నీటితో చెబుతోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ.. ఇంటి యజమానులు ఆమె మీద.. శారీరక, లైంగిక దాడి చేస్తారని కన్నీళ్లు పెట్టుకుంటూ కుల్దీప్‌ చెబుతోంది. అత్యంత కఠిన, దారుణ పరిస్థితుల మధ్య పనిచేస్తున్నట్లు కుల్దీప్‌ వీడియోలో చెప్పింది. ఎవరైనా నన్ను ప్రాణాలతో కాపాడండి.. అని కుల్దీప్‌ వీడియోలో వేడుకుంటోంది.

జీవితంలో మళ్లీ ఇంటిని, సొంత మనుషులను చూడాలని ఉందంటూ.. ఆమె పడుతున్న ఆవేదన చూస్తే.. ఏ వ్యక్తి అయినా బాధపడాల్సిందే. ఆమె ఫోన్‌ నెంబర్‌, ఇతర వివరాలు వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement