లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు లైంగిక సామర్థ్య పరీక్షను నిర్వహించేందుకు సోమవారం గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు.
లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు లైంగిక సామర్థ్య పరీక్షను నిర్వహించేందుకు సోమవారం గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించడం తప్పనిసరని పోలీసులు తెలిపారు.
ఓ మహిళా జర్నలిస్టును లైంగిక వేధించాడనే ఆరోపణలపై తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం కోర్టులో హాజరు పరచగా ఆయనను ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. విచారణలో భాగంగా 50 ఏళ్ల తేజ్పాల్ను పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.