‘ఆయన పద్మా పురస్కారానికి అర్హుడు’

Tamil Nadu Postman Deliver Letters Through Walk 15 km Every Day - Sakshi

తమిళనాడు: దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్‌ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు. అతడి పేరు డి శివన్‌. తమిళనాడులో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు ఉత్తరాలు చేరవేయడానికి అతడు దట్టమైన అడవి, జలపాతాల గుండా 15 మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆయన క్రూర మృగాల దాడులను కూడా ఎదుర్కొన్నాడు. ఆయినా బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లీ తన విధులను నిర్వర్తించాడు. 

ప్రస్తుతం శివన్‌ పదవి విరమణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్‌ను ప్రశసింస్తూ ఐఏస్‌ అధికారి సుప్రియా సాహు బుధవారం ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ ట్వీట్‌కు వేల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేసిన శివన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతున్నారు. ‘దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది... అతని నిబద్ధతకు అభినందనలు’, ‘అతను పద్మ పురస్కారానికి అర్హుడు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top