గోవాలో సిరియా పౌరుడి అరెస్ట్ | Syrian Man Detained By Police In Goa Allegedly For 'Overstaying' | Sakshi
Sakshi News home page

గోవాలో సిరియా పౌరుడి అరెస్ట్

Jan 26 2016 5:36 PM | Updated on Nov 6 2018 8:59 PM

గోవాలో సిరియా పౌరుడి అరెస్ట్ - Sakshi

గోవాలో సిరియా పౌరుడి అరెస్ట్

గోవాలో అక్రమంగా నివసిస్తున్న సిరియా దేశస్తుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.

పణజి: గోవాలో అక్రమంగా నివసిస్తున్న సిరియా దేశస్తుడిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. వీసా గడువు తీరినా అతడు స్వదేశానికి వెళ్లకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సిరియా పౌరుడి అరెస్ట్ ను ఐజీ సునీల్ గార్గ్ ధ్రువీకరించారు. అతడిని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

'కాసినో ప్రాంతంలో గతరాత్రి అతడిని అరెస్ట్ చేశాం. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇండియాలోనే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమంగా ఉన్నందుకు అతడిపై కేసు నమోదు చేశాం' అని గార్గ్ తెలిపారు. అయితే అతడిని తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయో, లేవో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. సిరియా పౌరుడు అరెస్ట్ ను ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా ధ్రువీకరించారు. దర్యాప్తు సాగుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement