శివకుమార స్వామికి తుది నివాళులు | Swamiji Last Rites Will Be Performed On Tuesday | Sakshi
Sakshi News home page

శివకుమార స్వామికి తుది నివాళులు

Jan 22 2019 11:50 AM | Updated on Jan 22 2019 8:02 PM

 Swamiji Last Rites Will Be Performed On Tuesday - Sakshi

శివకుమార స్వామికి భక్తుల తుది నివాళులు

సాక్షి, బెంగళూర్‌ : లంగ్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన ఆథ్యాత్మిక గురు, సిద్ధగంగ మఠానికి చెందిన శివకుమార స్వామి (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరగనున్నాయి. శివకుమార స్వామిని కడసారి వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు, సన్యాసులు తుంకూర్‌లోని మఠానికి తరలివచ్చారు. లింగాయత్‌ల ఆరాధ్యదైవంగా పేరొందిన స్వామిని నడిచే దేవుడిగా వారు భావిస్తుంటారు.

శివకుమార స్వామి మృతికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. స్వామి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి సాగించారని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement