కీలక తీర్పులకు సుప్రీం సిద్ధం | Supreme Court Reopens Today After Summer Break | Sakshi
Sakshi News home page

నేడు తిరిగి ప్రారంభంకానున్న సుప్రీంకోర్టు

Jul 2 2018 10:15 AM | Updated on Sep 2 2018 5:18 PM

Supreme Court Reopens Today After Summer Break - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వేసవి సెలవుల అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం నేడు తిరిగి ప్రారంభంకానుంది. 44 రోజుల విరామం తరువాత సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించేందుకు సిద్ధమైంది. వేసవి సెలవుల నేపథ్యంలో కోర్టు విధులకు దూరంగా ఉండటంతో పలు కీలక కేసులు పెండింగులో ఉన్నాయి. నేడు తిరిగి ప్రారంభవ్వడంతో పలు కీలక అంశాలపై  తీర్పును వెలువరించనుంది. పౌరుల వ్యక్తిగత గోపత్యకు సంబందించిన ఆధార్‌ కేసు సుప్రీం ధర్మాసనం ముందు ఉంది.

ఆయోధ్య వివాదం, ముస్లింల బహుభార్యత్వంపై  తీర్పును వెలువరించాల్సి ఉంది. ఇటీవల వివాదంగా మారిన ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ ​అధికారాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో కాలుష్యం, అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, వైష్ణో దేవి పునరావాసం, మణిపూర్‌లో ఇటీవల జరిగిన్‌ ఎన్‌కౌంటర్‌ వంటి అంశాలపై విచారణ చేపటాల్సిఉంది. నేటి నుంచి గుర్తింపు పొందని (నాన్‌ ఎక్రిడేట్‌) పాత్రికేయులు కూడా కోర్టు అవరణలోకి మొబైల్‌​ ఫోన్స్‌ తీసుకెళ్లెందుకు సుప్రీం ధర్మాసనం అనుమతినిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement