ప్రజల్లేకుండానే రథయాత్ర

Supreme Court allows Puri Jagannath Rath Yatra with no public attendance - Sakshi

పూరీ రథయాత్రకు సుప్రీంకోర్టు పచ్చజెండా

యాత్ర సమయంలో కర్ఫ్యూ

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథోత్సవం నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరాదని షరతు విధించింది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మంచి రికార్డును పరిగణనలోకి తీసుకున్నాం. అదే జాగ్రత్త, అప్రమత్తతను రథయాత్ర విషయంలోనూ కనబరుస్తారని ఆశిస్తున్నాం.

18, 19వ శతాబ్దంలో ప్రబలిన ప్లేగు, కలరా ఇలాంటి ఉత్సవం వల్లే ప్రబలిందని మనకు చరిత్ర చెబుతోంది. దానిని దృష్టిలో ఉంచుకునే 18వ తేదీ నాటి తీర్పులో ఈ ఉత్సవంపై స్టే విధించాం. యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోకుంటే అలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదముంది’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు ఒడిశాలోని పూరీ యాత్రపైనే తప్ప, ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కాదని పేర్కొంది. గతంలో విధించిన స్టేను ఎత్తేయాలంటూ జగన్నాథ్‌ సంస్కృతి జన జాగరణ మంచ్, బీజేపీ నేత సంబిత్‌ మహాపాత్ర తదితరులు పిటిషన్లు వేయడం తెల్సిందే.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బొపన్నల బెంచ్‌ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే నాగ్‌పూర్‌లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ ట్రస్టు సహకారంతో ప్రజారోగ్యంపై ఏ మాత్రం రాజీపడకుండా రథ యాత్రను చేపడతామని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ హామీ ఇచ్చారు.  కేంద్రం, ఆలయ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని రథయాత్రను నిబంధనలకు లోబడి సజావుగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర 10 నుంచి 12 రోజుల పాటు కొనసాగనుంది.

సుప్రీంకోర్టు నిబంధనలివీ
► రథయాత్ర సమయంలో పూరీ నగరంలో కర్ఫ్యూ విధించాలి.

► ప్రజలు ఇళ్లలోంచి బయటకురావద్దు

► ఒక్కో రథాన్ని 500 మంది (పోలీసులు, సిబ్బంది కలిపి) మాత్రమే లాగాలి.

► ఒక్కో రథం గంట సమయం తేడాతో ముందుకు కదలాలి.

► నగరంలోకి ప్రవేశించే అన్ని దారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను మూసివేయాలి.

► తీర్పు వెలువడిన సోమవారం రాత్రి 8 గంటల నుంచే కర్ఫ్యూ అమలు.

► వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమం కవరయ్యేలా మీడియాకు అనుమతి.

► రథాన్ని లాగే వారందరికీ కరోనాæ పరీక్షలు చేయాలి. రథయాత్రకు ముందు, రథయాత్ర సమయంలో, తర్వాతా వారు భౌతిక దూరం పాటించాలి. వారందరి ఆరోగ్య రికార్డులను నిర్వహించాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

01-12-2020
Dec 01, 2020, 09:39 IST
సాక్షి, ముంబై : ఇకపై ముంబైకర్లు మాస్కు ధరించకపోతే జరిమానా వసూలు చేసి వారికి ఉచితంగా ఓ మాస్కును అందించనున్నట్లు...
01-12-2020
Dec 01, 2020, 08:34 IST
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు యావత్‌ ప్రపంచం ఇప్పుడు వ్యాక్సిన్‌ వైపు చూస్తోంది.
01-12-2020
Dec 01, 2020, 08:24 IST
హూస్టన్‌ : కరోనా బాధితుడి ఆవేదన విని కరిగిపోయి ఆలింగనం చేసుకున్న వైద్యుడి ఫొటో అమెరికా సోషల్‌ మీడియాలో వైరల్‌గా...
01-12-2020
Dec 01, 2020, 07:46 IST
కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను భారత్‌ సాధ్యమైనంత త్వరలో పొందుతుందన్న విశ్వాసాన్ని కేంద్రం రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ...
30-11-2020
Nov 30, 2020, 19:56 IST
సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరీక్షల సంఖ్య కోటి...
30-11-2020
Nov 30, 2020, 19:07 IST
కరోనా వైరస్‌  వ్యాక్సిన్ ప్రయోగాల్లో వరుస సానుకూల ఫలితాలు భారీ ఊరటనిస్తున్నాయి.తాజాగా  అమెరికాకు బయోటెక్ దిగ్గజం మోడర్నా తన కోవిడ్-19...
30-11-2020
Nov 30, 2020, 18:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశ రాజధాని ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేస్తోన్న కరోనా టెస్ట్‌...
30-11-2020
Nov 30, 2020, 13:15 IST
జైపూర్:  భారతీయ జనతా పార్టీ శాసన సభ్యురాలు కిరణ్ మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడిన...
30-11-2020
Nov 30, 2020, 10:18 IST
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,772 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.
30-11-2020
Nov 30, 2020, 05:16 IST
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక మైలు రాయిని అధిగమించింది.
30-11-2020
Nov 30, 2020, 04:46 IST
కరోనా టీకా ‘కోవిషీల్డ్‌’తో ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్‌ ఫిర్యాదు...
29-11-2020
Nov 29, 2020, 17:31 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు...
29-11-2020
Nov 29, 2020, 09:46 IST
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 75 మందికి కరోనా పాజిటివ్‌ రావడం...
29-11-2020
Nov 29, 2020, 04:37 IST
సాక్షి, హైదరాబాద్, మేడ్చల్‌: దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా...
28-11-2020
Nov 28, 2020, 20:28 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625...
28-11-2020
Nov 28, 2020, 20:25 IST
సాక్షి, అమరావతి: ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అని సామెత. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న గణిత శాస్త్రవేత్తలకు ఇప్పుడీ సామెత...
28-11-2020
Nov 28, 2020, 18:55 IST
కంపెనీలు ప్రకటిస్తున్న ఏ కరోనా వ్యాక్సిన్లను తీసుకోమంటూ కొంత మంది దేశాధినేతలే ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది.
28-11-2020
Nov 28, 2020, 17:03 IST
వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే....
28-11-2020
Nov 28, 2020, 16:42 IST
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిన నాలుగు వారాల్లోనే ఢిల్లీ వాసులందరికి అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్...
28-11-2020
Nov 28, 2020, 16:06 IST
భోపాల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top