‘సన్నీ లియోన్‌’ షోకు అనుమతి ఇవ్వం

Sunny Leone show controversy in Bengaluru - Sakshi

బెంగళూరు: బెంగళూరులో డిసెంబర్‌ 31న జరిగే కొత్త ఏడాది వేడుకల్లో బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ పాల్గొననున్న ఓ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక రక్షణ వేదికే(కేఆర్‌వీ)తో పాటు పలు కన్నడ సంఘాలు సన్నీ వేడుకపై ఆందోళనల∙నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. ‘అలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని నేను అధికారుల్ని ఆదేశించాను. కన్నడ సంస్కృతి, సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఈవెంట్‌ నిర్వాహకులు చేపట్టాలి’ అని రాష్ట్ర హోంమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top