‘పాకిస్తాన్‌కు నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు’

Sunny Deol To Be Part Of Kartarpur Corridor Inaugural Function - Sakshi

చంఢీగడ్‌ : కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంలో బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్‌ పాల్గొంటారని పంజాబ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈసందర్భంగా సన్నీ డియోల్‌.. ‘నేను కాకపోతే.. ఇంకెవరు వెళ్తారు. నేను తప్పకుండా వెళ్తా’అని మీడియాతో అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన సన్నీ అక్కడి గురుద్వారలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం గమనార్హం. కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం (నవబంర్‌ 9) ప్రారంభం కానుంది.
(చదవండి : సిద్ధూకు పాక్‌ వీసా మంజూరు) 

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పంజాబ్‌ సీఎం కెప్టెన్‌​ అమరీందర్‌సింగ్‌, కేంద్ర మంత్రులు హరదీప్‌ పూరి, హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు విదేశీ వ్యవహారాలశాఖ అనుమతినిచ్చింది.  భారత్‌ నుంచి 550 మంది సిక్కు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాయాది దేశానికి వెళ్తున్నారు. పాకిస్తాన్‌లోని రావి నది ఒడ్డున కర్తార్‌పూర్‌లోని గురుద్వార దర్బార్‌ సాహిబ్‌ను సిక్కులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ దేవ్‌ అక్కడ 18 ఏళ్లపాటు గడిపారు.
(చదవండి : ‘కర్తార్‌పూర్‌’పై పాక్‌ వేర్వేరు ప్రకటనలు)

ప్రతియేడు పెద్ద సంఖ్యలో సిక్కులు కర్తార్‌పూర్‌ గురుద్వారను సందర్శిస్తారు. గురునానక్‌ దేవ్‌ దైవైక్యం పొందిన గురుదాస్‌పూర్‌ గురుద్వార.. గురుద్వార దర్బార్‌ సాహిబ్‌ను కలుపుతూ నిర్మించిందే కర్తార్‌పూర్‌ కారిడార్‌. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి (నవంబర్‌ 12) వేడుకలను జరుపుకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్‌ను ప్రారంభించినున్నట్టు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top