‘కర్తార్‌పూర్‌’పై పాక్‌ వేర్వేరు ప్రకటనలు

Pakistan U-turn on Kartarpur Corridor - Sakshi

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను అనుసంధానించే కర్తార్‌పూర్‌ కాడిడార్‌ ప్రారంభోత్సవానికి సంబంధించి పాక్‌ భిన్నమైన సమాచారమిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ సందర్శనకు వచ్చే భారతీయ యాత్రీకులు పాస్‌పోర్ట్‌ను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదని, ఏదైనా చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రం తెచ్చుకుంటే చాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ గతంలో పేర్కొన్నారు. తాజాగా, భద్రతా కారణాల రీత్యా భారతీయ యాత్రీకులు తమ వెంట పాస్‌పోర్ట్‌ తెచ్చుకోవాల్సిందేనని పాక్‌ ఆర్మీ  స్పష్టం చేసింది. పాక్‌ తీరుపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.  ద్వైపాక్షిక ఒప్పందం అంశాలను పాక్‌  అమలు చేయాలని కోరింది.  కాగా, పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూకు శనివారం జరిగే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవంలో పాకిస్తాన్‌ తరఫున పాల్గొనడానికి ప్రభుత్వం గురువారం రాజకీయ అనుమతి ఇచ్చింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top