ప్రియాంకా చోప్రాకు సుబ్బిరామిరెడ్డి సత్కారం | Subbiramireddy prises to Priyanka Chopra | Sakshi
Sakshi News home page

ప్రియాంకా చోప్రాకు సుబ్బిరామిరెడ్డి సత్కారం

Apr 14 2016 3:38 AM | Updated on Sep 3 2017 9:51 PM

ప్రియాంకా చోప్రాకు సుబ్బిరామిరెడ్డి సత్కారం

ప్రియాంకా చోప్రాకు సుబ్బిరామిరెడ్డి సత్కారం

పద్మ శ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాను కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీలోని తాజ్‌మహల్ హోటల్‌లో సత్కరించారు.

సాక్షి, న్యూఢిల్లీ: పద్మ శ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నటి  ప్రియాంకా చోప్రాను కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీలోని తాజ్‌మహల్ హోటల్‌లో సత్కరించారు. టీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి, నటుడు మోహన్ బాబు ప్రియాంకకు బంగారు గాజులు తొడిగి సన్మానించారు.

ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. భారత సినీ రంగంలోనే కాక ఆమెరికా టెలివిజన్ స్టార్‌గా ప్రియాంకా చోప్రా మన్ననలు పొందారని కొనియాడారు. కార్యక్రమానికి బ్రిటిష్ హైకమిషనర్ సర్ డోమ్నిక్, బాలీవుడ్ నటుడు శతృ ఘ్న సిన్హా, వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, దౌత్యాధికారులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement