మెహబుబా ముఫ్తీ వాహన శ్రేణిపై రాళ్ల దాడి | Stones Pelted At Mehbooba Muftis Cavalcade | Sakshi
Sakshi News home page

మెహబుబా ముఫ్తీ వాహన శ్రేణిపై రాళ్ల దాడి

Apr 15 2019 2:16 PM | Updated on Apr 15 2019 5:56 PM

Stones Pelted At Mehbooba Muftis Cavalcade - Sakshi

శ్రీనగర్‌ : పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ చీఫ్‌, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ బైక్‌ ర్యాలీపై సోమవారం రాళ్ల దాడి జరిగింది. అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఆమె సురక్షితంగా బయటపడగా, ఎస్కార్ట్‌ వాహనం ధ్వంసమైంది. ఖిరాం గ్రామంలో దర్గాను సందర్శించి బిజ్‌బెహరా పట్టణానికి తిరిగి వస్తుండగా ఆమె వాహన శ్రేణిపై కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దుండగుల బారి నుంచి ఆమెను కాపాడిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

భద్రతా సిబ్బంది సాయంతో ఆమె బిజ్‌బెహరా పట్టణానికి చేరుకుని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాళ్ల దాడిలో మెహబూబా ముఫ్తీ డ్రైవర్‌కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఆమె అనంత్‌నాగ్‌ స్ధానం నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి మెహబూబా గెలుపొందిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement