జస్ట్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌!

Special chit chat with big boss contestant tejaswi - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నన్ని రోజులూ తేజస్వి స్నేహసామ్రాజ్ఞిలా ఉన్నారు. హౌస్‌ నుంచి బయటికి వచ్చాక కూడా ఆ సామ్రాట్‌ని– ఈ సామ్రాజ్ఞినీకలిపి చూడటం మానడం లేదు టీవీ వీక్షకులు!అసలు తేజస్వి–సామ్రాట్‌ల మధ్య ఉన్నది జస్ట్‌.. క్లోజ్‌ ఫ్రెండ్షిప్పా? అంతకన్నా ఎక్కువేనా?!ఎలిమినేట్‌ అయినవారిని మర్చిపోతాం.  తేజస్వి మాత్రం ‘ఎలివేట్‌’ అయ్యారు!! ఎందుకు? చదవండి. తేజస్వితో సాక్షి ఇంటర్వ్యూ.

‘‘నేనసలు బిగ్‌ బాస్‌ ఫస్ట్‌ సీజన్‌కే వెళ్లాల్సి ఉండింది. కుదరలేదు. తర్వాత  ‘మా’ అవార్డ్స్‌ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు బిగ్‌ బాస్‌ –2 కోసం నన్ను అప్రోచ్‌ అయ్యారు. అలా సెకండ్‌ సీజన్‌లో బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంటర్‌ అయ్యాను. నాతో పాటు ఇంకెవరెవరు హౌజ్‌లోకి వస్తున్నారో అప్పటికి  హాడ్‌ నో ఐడియా ఎబౌట్‌ దట్‌. వెళ్లాకే  తెలిసింది ఎవరెవరెవరు ఉన్నారో!

ఏడ్చేశాను
నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నకు ఆల్కహాల్‌ ప్రాబ్లమ్‌. దాంతో పదిహేడేళ్లకే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేశా. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. పదేళ్ల నుంచి ఒంటరిగా ఉండటం వల్లేమో  బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎలా నడుచుకోవాలో  తెలీలేదు. చుట్టూ కెమెరాలున్నాయి అనే ధ్యాస లేకుండా  నా స్వభావానికి తగ్గట్టే బిహేవ్‌ చేశాను. హౌజ్‌లోకి ఎంటర్‌ అవగానే  అందరితో కలిసిపోయా. కాని అదే తప్పని తర్వాత తెలిసింది. నాకు కన్నింగ్‌గా ఉండటం రాదు.  టీవీలో అందరూ చూస్తుంటారు అన్న స్పృహ లేకుండా పక్కనున్న మనిషి గురించి హౌజ్‌లో కొంతమంది ఏదిపడితే అది మాట్లాడుతుంటే  చాలా కోపం వచ్చేది. దాంతో అరిచేశా. ఒకసారి నానీ నన్ను తిట్టాడు.. చాలా బాధనిపించిఏడ్చాను  కూడా.

ఫోన్‌ వెదుక్కున్నా.. 
ఫోన్, టీవీ, ఫ్రెండ్స్‌ .. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా..  లిమిటెడ్‌ సోర్సెస్‌తో.. పగలు, రాత్రి తేడా తెలియకుండా..  సగం ఆకలి, సగం నిద్రతో హౌజ్‌లో గడపడం.. యు కాంట్‌ ఇమాజిన్‌. అయినా ఐ ఎంజాయ్డ్‌ ఎ లాట్‌. ఏం జరిగినా వెంటనే ఫోన్‌ చేసి ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవడం అలవాటు కదా. ఆ అలవాటుతోనే  ఫస్ట్‌ టూ డేస్‌ ఫోన్‌ కోసం చాలా వెదుక్కున్నా. తర్వాత గుర్తుచేసుకుంటే నవ్వొచ్చేది.  అప్పటిదాకా మా ఇంట్లో నేను చేయని పనులన్నీ హౌజ్‌లో చేశాను. బట్టలు ఉతికాను. వంట చేశాను. నా వంటలను అందరూ మెచ్చుకున్నారు. తెలుగులో పొలైట్‌గా  ఎలా మాట్లాడాలో  హౌజ్‌లోనే తెలుసుకున్నా.  ప్రాబ్లం వస్తే  అందరూ కలిసి ఎలా  సాల్వ్‌ చేసుకోవాలి? పదిమందితో ఎలా సర్దుకుపోవాలి? ఎక్కడ తగ్గాలి? ఎక్కడ నెగ్గాలి? పట్టూవిడుపులు అన్నీ నేర్చుకున్నా. 

సామ్రాట్‌.. ట్రోలింగ్‌..
నిజానికి సామ్రాట్‌ నాకు ఎనిమిదేళ్ల కిందటే పరిచయం. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా. అంత క్లోజ్‌ కాదు అప్పుడు. అసలు సామ్రాట్‌కి పెళ్లి అయిందని, అది  ప్రాబ్లమ్‌లో ఉందని హౌజ్‌లో అతనితో  మాట్లాడుతుంటేనే తెలిసింది. సామ్రాట్‌ చాలా జోవియల్‌గా ఉంటాడు.ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ  ఉంటాడు.  దాంతో అతనితో కనెక్ట్‌ అయ్యా. క్లోజ్‌  ఫ్రెండ్‌గా మారాడు.  అంతమాత్రాన  నన్ను ట్రోల్‌ చేయడమేనా? మైగాడ్‌ నా క్యారెక్ట్‌నే అసాసినేట్‌ చేసేలా బూతులు..! ఒక అమ్మాయి.. ఒక అబ్బాయితో ఎమోషనల్‌గా అటాచ్‌ కావడం తప్పా? అది కంప్లీట్‌ పర్సనల్‌ థింగ్‌! నేను ఎవరితో మాట్లాడాలి? నా ఫ్రెండ్స్‌లిస్ట్‌లో ఎవరుండాలి? ఎవరితో ఎంత మేరకు స్నేహం చేయాలి.. ట్రోలర్స్‌ డిసైడ్‌ చేస్తారా? నా పర్సనల్‌ స్పేస్‌ నాకు ఉండదా? హౌజ్‌లో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు. బయటకు వచ్చాక  తెలిసింది. ట్రోలింగ్స్‌  చాలా ఫ్రస్టేట్‌ అయ్యా. కుంగిపోయా. అయితే నన్ను ఎంకరేజ్‌ చేస్తూ కూడా అంతకన్నా ఎక్కువ పోస్టింగ్స్‌వచ్చాయి. ‘‘తేజా.. నువ్వు లేని బిగ్‌ బాస్‌ చూడాలనిపించట్లేదు. నువ్వు మా ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తావ్‌..  బ్లెస్‌ యూ.. వుయ్‌ లవ్‌ యూ’’అంటూ చాలా కాంప్లిమెంట్స్‌.. యూకే, యూఎస్‌ నుంచి. ఇక్కడి వాళ్లూ చాలామంది మోరల్‌గా సపోర్ట్‌ చేస్తూ మెస్సేజెస్‌ పెట్టారు. వాటితోనే  తేరుకున్నా. ట్రోలింగ్స్‌ను పట్టించుకోవడం మానేశా. ఇప్పుడు.. నేనే ధైర్యం చెప్పే స్థితిలో ఉన్నా. కొంతమందైతే సామ్రాట్‌తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒక మనిషితో ఉన్న క్లోజ్‌నెస్‌ను పెళ్లితో ముడిపెడతారా? వండర్‌! సామ్రాట్‌ నాకు మంచి ఫ్రెండ్‌ ఎప్పటికీ. డౌటే లేదు. 

హౌజ్‌ మేట్స్‌
తనీష్, బాబుగోగినేని గారు మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. లైఫ్‌ పట్ల బాబుగోగినేని గారికి ఎలాంటి అభిప్రాయాలున్నాయో నాకూ అలాంటివే ఉన్నాయి. నేను ఆయనకు అభిమానినైపోయా. తనీష్‌కు కోపం ఎక్కువ. దాన్ని కంట్రోల్‌ చేసుకోవడం నేర్చేసుకున్నాడు.  వాళ్లమ్మ చాలా టెన్షన్‌ పడ్తుంటే నేను చెప్తున్నా.. డోంట్‌ వర్రీ ఆంటీ అని. బాబుగోగినేని గారిలాగే వాళ్లావిడ కూడా చాలా స్మార్ట్‌ (నవ్వుతూ) ఆవిడ, వాళ్ల బాబు చాలా కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.  హౌజ్‌లో ఉన్న వాళ్లందరికీ కెమెరా ముందు ఎలా ఉండాలో తెలిసిపోయింది. అందుకే అందరూ యాక్షన్‌ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా బిహేవ్‌ చేస్తున్నారు.   

ఎదిగిన ఫీలింగ్‌
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో  చాలా హ్యాపీగా ఉన్నా.  ఇప్పుడు మళ్లీ వెళ్లే అవకాశం వస్తే  వెళ్తా. ఈ ఎక్స్‌పీరియెన్స్‌తో హౌజ్‌లో బాగా ఓవరాక్షన్‌ చేస్తా. నా విషయంలో నా ఫ్రెండ్స్‌ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. నేనేంటో వాళ్లకు తెలుసు. ‘‘ షోలో గెలిచొస్తావని పంపిస్తే..ఇలా వచ్చేశావ్‌’’ అని ఆటపట్టిస్తుంటారు. బేసిగ్గా నేను కొంచెం లౌడ్‌గా ఉంటా.  ఒంటరిపోరాటమే కాబట్టి..అలా అలవాటైంది. పైగా మేల్‌డామినేటెడ్‌ సొసైటీ.. మేల్‌డామినేటెడ్‌ ఫీల్డ్‌.. లౌడ్‌గా లేకపోతే అంతే సంగతి. మొదటి నుంచే స్ట్రాంగే.. బిగ్‌ బాస్‌ హౌజ్, ట్రోలింగ్స్‌ లాంటి అనుభవాలు నన్ను ఇంకా స్ట్రాంగ్‌ చేశాయి. ఎదిగిన ఫీలింగ్‌. ఇది కరెక్ట్‌ .. ఇది రాంగ్‌ అని నాకు ఎవరూ చెప్పలేదు. సిట్యుయేషన్సే అన్నీ నేర్పాయి. కాబట్టి అవే  నాకు పేరెంట్స్‌. ఫ్రెండ్సే నాకు అన్నీ. డాన్స్‌ అండ్‌ వర్క్‌తో నా లోన్లీనెస్‌ను ఓవర్‌కమ్‌ చేసుకుంటా. నా వెంట నిలిచిన వాళ్లందరికీ థ్యాంక్స్‌. 

ఫ్యూచర్‌ 
ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వస్తే అన్నీ  చేశాను. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌.. ఇంకా అలాంటి చానల్స్‌కు ట్రావెల్‌ షో చేయాలనే థింకింగ్‌ ప్రాసెస్‌లోఉన్నా. తమిళ్, తెలుగు సినిమా చాన్సెసూ కొన్ని ఉన్నాయి. కథలు వింటున్నా’’ అని తన ఫీలింగ్స్‌ని షేర్‌ చేసుకున్నారు తేజస్వి.. బిగ్‌బాస్‌ స్టార్‌. 

చూపిస్తున్నది కొన్నే
హౌజ్‌లో చాలా కన్‌ఫ్యూజన్‌ ఉంది. 24 గంటలూ కెమెరాల ముందే కదా.. అంతా టెలికాస్ట్‌ అవుతుందేమో అనుకుంటాం. కాని కావట్లేదు.  నా విషయమే తీసుకుంటే.. నేను అరిచినవి మాత్రమే చూపించారు. దానికిముందు కౌశల్‌ చేసినవి చూపించలేదు. కౌశల్‌ చేసిన వాటికి కోపమొచ్చి నేనలా అరిచా. అదే హైలైట్‌ అయింది. సామ్రాట్‌ విషయంలోనూ అంతే. ముందూవెనకా చూపించకుండా.. జనాలు దేనికి ఎంటర్‌టైన్‌ అవుతారో దాన్నే చూపిస్తున్నారు. ఈవెన్‌ ప్రోమోస్‌ కూడా అంతే.  దీని వల్లే చాలామంది స్క్రిప్టెడ్‌ షో అనుకుంటున్నారు. టీఆర్‌పీని దృష్టిలో పెట్టుకుని ఎడిట్‌ చేస్తున్నారు. 45 నిమిషాల ఎడిటెడ్‌ వెర్షన్‌లో అదే నిజమనుకుంటే ఎలా? దానికి ముందు ఏం జరిగిందో.. ఎవరు దేనికి.. ఎందుకు అలా రెస్పాండ్‌ అవుతున్నారో చూపించకుండా కేవలం రెస్పాన్సెస్‌నే  చూపిస్తున్నారు. న్యాయంగా అనిపించట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలేవీ హౌజ్‌లో ఉన్నవాళ్లకు తెలియవు. బయటకు వస్తే కాని అర్థంకాదు జరుగుతున్నదేంటో!
– శరాది
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top