దృఢ సంకల్పం విషయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ప్రధాని మోదీకి మధ్య పోలికే లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: దృఢ సంకల్పం విషయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ప్రధాని మోదీకి మధ్య పోలికే లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మోదీకి సాటిరాగల నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేరనే వాదనను ఆమె తోసిపుచ్చారు. సోమవారం అలహాబాద్‌లో ఇందిర ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనేది తన తొలి కఠిన నిర్ణయమన్నారు. ఇందిరకు కోడలిని అరుు ఉండకపోతే రాజకీయాల్లోకి వచ్చేదాన్ని కాదన్నారు. రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పే విషయంపై మాట్లాడ్డానికి లేదా నిర్ణయం తీసుకోవడానికి తాను సరైన వ్యక్తిని కాదన్నారు.