మా అమ్మను వేధిస్తారా: వేదికపై సింగర్ల గలాట | singers create ruckus on stage after organisers misbehave with mother | Sakshi
Sakshi News home page

Feb 28 2018 11:46 AM | Updated on Feb 28 2018 11:46 AM

singers create ruckus on stage after organisers misbehave with mother - Sakshi

వేదికపై గాయకుల గలాటా.. (వీడియో స్క్రీన్‌షాట్‌)

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తాజ్‌ మహోత్సవ్‌లో ఇద్దరు సింగర్లు వేదికపై రభస చేశారు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజ్‌ మహోత్సవ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమ్లాల్లో భాగంగా గాయకులు పలక్‌ ముచ్చల్‌, ఆమె సోదరుడు పలాష్‌ ముచ్చల్‌ సంగీత విభావరి ఇచ్చారు. అయితే, ఈ సమయంలో ఒక నిర్వాహకుడు తమ తల్లితో దురుసుగా ప్రవర్తించాడంటూ.. వారు వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేదికపై రచ్చ చేస్తూ.. నిర్వాహకుడి తీరుపై పలక్‌ మండిపడింది. అతను తన తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వేదిక మీద మైక్‌లో ఆమె పేర్కొనడం వీడియోలో వినిపిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమం మధ్యలోనే గాయకులు ఇలా గొడవకు దిగడంతో నిర్వాహకులు జోక్యం చేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. తాజ్‌మహల్‌ను, మొఘల్‌ సంస్కృతిని గుర్తుచేసుకునేందుకు ప్రతి ఏడాది యూపీ సర్కారు తాజ్‌ మహోత్సవ్‌ నిర్వహించే సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement