మహిళలను పట్టించుకోని బడ్జెట్‌ | Siddaramaiah About Union Budget 2019 | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌పై సిద్దరామయ్య ఆగ్రహం

Jul 5 2019 6:45 PM | Updated on Jul 5 2019 6:49 PM

Siddaramaiah About Union Budget 2019 - Sakshi

బెంగళూరు : మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతోన్న బడ్జెట్‌ పట్ల స్త్రీలు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ నిర్మలా సీతారామన్‌ వారికి మొండి చెయ్యి చూపారన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామాయ్య. కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. దేశ ప్రజలు ఈ బడ్జెట్‌ పట్ల సంతోషంగా లేరన్నారు. ప్రజల ఆశలపై నీళ్లు కుమ్మరించేలా బడ్జెట్ ఉందన్నారు. గతంలో మోదీ ప్రభుత్వం వ్యవసాయం రంగంలో రెట్టింపు పెరుగుదల చూపుతామన్నారు. కానీ దాన్ని సాధించలేకపోయారని విమర్శించారు.

కనీస మద్దతు ధర గురించి బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు సిద్దరామయ్య. రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టిన బడ్జెట్‌ ఇది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన గురించి బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం బాధకరమన్నారు. గత 45 ఏళ్లల్లో కంటే అత్యధిక నిరుద్యోగిత రేటు ప్రస్తుతం నమోదయ్యిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement