చెల్లి కోసం అక్క గళం | Shruti Haasan sings for younger sister Akshara in her debut film Shamitabh | Sakshi
Sakshi News home page

చెల్లి కోసం అక్క గళం

Oct 22 2014 12:58 AM | Updated on Apr 3 2019 6:23 PM

చెల్లి కోసం అక్క గళం - Sakshi

చెల్లి కోసం అక్క గళం

చెల్లెలి కోసం అక్క గీతాలాపన చేయడంతో ఆ చిత్రానికి అదనపు ప్రచారం లభిస్తోంది. ఆ చిత్రం పేరే షమితాబ్. యువ నటుడు ధనుష్ నటిస్తున్న రెండో హిందీ చిత్రం ఇది.

 చెల్లెలి కోసం అక్క గీతాలాపన చేయడంతో ఆ చిత్రానికి అదనపు ప్రచారం లభిస్తోంది. ఆ చిత్రం పేరే షమితాబ్. యువ నటుడు ధనుష్ నటిస్తున్న రెండో హిందీ చిత్రం ఇది. ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్రముఖ నటుడు కమలహాసన్ రెండో కూతురు అక్షర హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న చిత్రం ఇది. అలాగే బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇదే చిత్రంలో ప్రముఖ నటి రేఖ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా ప్రత్యేకతలతో కూడిన ఈ చిత్రానికి చెల్లెలు అక్షర కోసం అక్క శ్రుతిహాసన్ ఒక పాటను పాడటం మరో విశేషం. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతబాణీలందిస్తున్నారు.
 
 సంగీతంలో ప్రావీణ్యం ఉన్న శ్రుతి హాసన్ ఇప్పటికే ఒక హిందీ చిత్రంతో పాటు తమిళంలో అడపాదడపా పాడుతున్నారు. నటిగా బిజీగా వున్న సంగీతంపై వున్న ప్రేమతో సమయం కుదిరితే మంచి పాట అనిపిస్తే పాడటానికి సిద్ధం అంటున్నారీ బ్యూటీ. అక్షర నటించిన షమితాబ్ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన మూడవ చిత్రం పూజై బుధవారం తెరపైకి రానుంది. తెలుగులో హిట్ చిత్రాల కథా నాయకిగా ప్రకాశిస్తున్న ఈ ముద్దుగుమ్మకి తమిళంలో పూజై చిత్ర విజయం చాలా అవసరం. ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు శ్రుతిహాసన్‌కు నిరాశనే మిగిల్చారుు. దీంతో ఈ ముద్దుగుమ్మ పూజై చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement