షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | Short Circuit.. House Burned | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Jul 30 2018 1:59 PM | Updated on Jul 30 2018 1:59 PM

Short Circuit.. House Burned - Sakshi

కాలిపోతున్న ఇల్లు 

రాయగడ : అంబొదల గ్రామంలో ఇందిరపొడ వీధిలో కిరాణ షాపుతో ఉన్న ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. బిజయసున్నా ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్‌ జరి గి అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. ఇంటిలో వస్తు సామగ్రి ధ్వంసమయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాహుల్‌ బాగ్‌(35), తన కుమారుడు రణవీర్‌ బా గ్‌(4) గాయపడ్డారు.

వీరు బిజయసున్నా ఇంటికి బంధువులుగా వచ్చారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో వీరు గాయపడ్డారు. వీరి లో రణవీర్‌ బాగ్‌ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ముందుగా అంబొదల ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమించడంతో బిసంకటక్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రణవీ ర్‌బాగ్‌ పరిస్థితి మరింత విషమించగా బరంపురం తరలించినట్టు తెలిసింది. దీనిపై అంబొదల పోలీ సులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. ఈ ఘటన తెలుసుకున్న బిసంకటక్‌ ఎమ్మెల్యే జగన్నాథసారక ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement