బట్టలూడదీసి..ఊరేగిస్తానని మహిళపై ఎమ్మెల్యే ప్రతాపం! | Shiva Sena MLA booked for threatening to strip and thrash woman | Sakshi
Sakshi News home page

బట్టలూడదీసి..ఊరేగిస్తానని మహిళపై ఎమ్మెల్యే ప్రతాపం!

Jul 3 2014 3:52 PM | Updated on Sep 2 2017 9:46 AM

బట్టలూడదీసి..ఊరేగిస్తానని మహిళపై ఎమ్మెల్యే ప్రతాపం!

బట్టలూడదీసి..ఊరేగిస్తానని మహిళపై ఎమ్మెల్యే ప్రతాపం!

ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించి.. అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన నేత, తూర్పు బాంద్రా ఎంఎల్ఏ ప్రకాశ్ బాలా సావంత్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ముంబై: ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించి.. అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన నేత, తూర్పు బాంద్రా ఎంఎల్ఏ ప్రకాశ్ బాలా సావంత్ పోలీసులు కేసు నమోదు చేశారు. బట్టలూడదీసి ఊరేగిస్తానని అనడమే కాకుండా మహిళపై దౌర్జన్యానికి దిగిన సంఘటన ముంబైలోని సబర్బన్ బాంద్రా లో చోటు చేసుకుంది. 
 
ఓ హౌసింగ్ సొసైటీ పునర్ నిర్మాణ వ్యవహారంలో చోటు చేసుకున్న గొడవ చోటు చేసుకుంది. నీ బట్టలూడదీసి ప్రతి ఒక్కరి ముందు ఊరేగిస్తాను అని అనడమే కాకుండా మహిళను చావబాదినట్టు ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
ఈ కేసులో మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎమ్మెల్యేపై ఐపీసీ ప్రకారం సెక్షన్ 504, 506, 509 కేసుల్ని పెట్టారు. ఎమ్మెల్యేతోపాటు, బాధితురాలు ఒకే హౌసింగ్ సొసైటీలో ఉంటున్నారని.. రీ డెవలప్ మెంట్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొందని బాంద్రా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement