‘పాక్‌ అంతంతోనే.. ప్రపంచ శాంతి’ | Shiv Sena World Peace Possible By Elimination Pakistan | Sakshi
Sakshi News home page

మరిన్ని దాడులు చేయండి : శివసేన

Feb 27 2019 7:41 PM | Updated on Feb 27 2019 7:42 PM

Shiv Sena World Peace Possible By Elimination Pakistan - Sakshi

ముంబై : పుల్వామా ఉగ్రదాడి - సర్జికల్‌ స్ట్రైక్స్‌తో భారత్‌ - పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌పై మరిన్ని దాడులు చేయాలంటూ శివసేన డిమాండ్‌ చేసింది. ఈ విషయం గురించి తన అధికార పత్రిక సామ్నాలో ‘పాక్‌ వల్ల కేవలం మనకు మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు కూడా ప్రమాదమే. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేది లేదు. అధికారం సైన్యం చేతిలో ఉంది. వారు దాని తప్పుగా వాడుతున్నారు. ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్‌ పూర్తిగా తొలగిస్తేనే శాంతి సాధ్యమవుతుంద’ని పేర్కొంది.

అంతేకాక ‘సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లే కశ్మీర్‌ భూభాగాలను పాక్‌ ఆక్రమించుకుని.. వాటిని ఉగ్ర స్థావరాలుగా మార్చింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే పాక్‌ మీద మరిన్ని దాడులు చేయాలని శివసేన డిమాండ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement