విచారణకు రానందుకుగాను దిగువకోర్టు మూడు లక్షల జరిమానా విధించడాన్ని సవాలుచేస్తూ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ శుక్రవారం హైకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: విచారణకు రానందుకుగాను దిగువకోర్టు మూడు లక్షల జరిమానా విధించడాన్ని సవాలుచేస్తూ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై గతంలో స్ధానిక న్యాయస్థానంలో పరువునష్టం కేసు దాఖలుచేసిన సంగతి విదితమే. ఈ కేసు ఆగస్టు నెల 26వ తేదీన విచారణకు వచ్చింది. అయితే ఆ విచారణకు మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు రూ. 3 లక్షల మేర జరిమానా విధించింది. దీనిని సవాలుచేస్తూ షీలాదీక్షిత్ శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.