ఎన్నారైల భద్రత మాకు చాలా ముఖ్యం: సుష్మా | Security of Indians abroad top priority: Sushma | Sakshi
Sakshi News home page

ఎన్నారైల భద్రత మాకు చాలా ముఖ్యం: సుష్మా

May 28 2016 2:13 PM | Updated on Jul 6 2019 12:42 PM

విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం భారతీయ దౌత్యవేత్తలకు అత్యంత ప్రాధాన్యమైన విషయమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు.

విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, సంక్షేమం భారతీయ దౌత్యవేత్తలకు అత్యంత ప్రాధాన్యమైన విషయమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. వివిధ దేశాల్లో ఉన్న భారత రాయబారుల వార్షిక సదస్సులో ఆమె మాట్లాడారు.

ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. విదేశాంగ విధాన లక్ష్యాల గురించి సమష్టిగా చర్చించేందుకు ఇదో మంచి అవకాశమని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ అన్నట్లు కూడా వికాస్ స్వరూప్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న 120 మంది భారత రాయబారులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement