కేరళ గవర్నర్గా సదాశివం ప్రమాణ స్వీకారం | Sathasivam sworn in as Kerala Governor | Sakshi
Sakshi News home page

కేరళ గవర్నర్గా సదాశివం ప్రమాణ స్వీకారం

Sep 5 2014 10:43 AM | Updated on Sep 2 2017 12:55 PM

కేరళ గవర్నర్గా సదాశివం ప్రమాణ స్వీకారం

కేరళ గవర్నర్గా సదాశివం ప్రమాణ స్వీకారం

కేరళ గవర్నర్గా పి.సదాశివం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

తిరువనంతపురం: కేరళ గవర్నర్గా పి.సదాశివం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని రాజ్భవన్లో జరిగిన
ప్రత్యేక కార్యక్రమంలో పి.సదాశివం చేత కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్, కేరళ అసెంబ్లీ స్పీకర్ జి.కార్తీకేయన్లు హాజరయ్యారు.

అయితే కేరళ గవర్నర్గా యూపీఏ హాయాంలో నియమితులైన షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో... బీజేపీ ప్రభుత్వం పి.సదాశివంను ఆ పదవిలో నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన సదాశివం ఈ ఏడాది ఏప్రిల్లో పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement