రైల్వేస్టేషన్లలో శానిటరీ నాప్‌కిన్ల అమ్మకం | Sanitary pads, condoms to be sold at railway stations | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లలో శానిటరీ నాప్‌కిన్ల అమ్మకం

May 27 2018 4:15 AM | Updated on May 27 2018 4:15 AM

Sanitary pads, condoms to be sold at railway stations - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల లోపల, బయట శానిటరీ నాప్‌కిన్లతో పాటు కండోమ్స్‌ను అమ్మాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వేస్టేషన్ల సమీపంలో నివసించే ప్రజల కోసం ఉచిత మరుగుదొడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ మేరకు అధికారులు రూపొందించిన ‘టాయిలెట్‌ పాలసీ’కి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.  పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు రైల్వేస్టేషన్ల సమీపంలో మరుగుదొడ్లను నిర్మించాలని సూచించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రైల్వేస్టేషన్ల లోపల, బయట చౌకగా లభించే శానిటరీ నాప్‌కిన్లు, కండోమ్స్‌ అమ్మేందుకు కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) నిధి సాయంతో దేశవ్యాప్తంగా 8,500 రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement