
భువనేశ్వర్/పూరీ : వరద ఉప్పెనతో చితికి పోయిన కేరళ ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రజలు వెన్ను తట్టి ఆదుకోవాలి. విపత్తు తాండవం చవి చూసిన రాష్ట్ర ప్రజల పూర్వ అనుభవాల దృష్ట్యా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హృదయం మానవతా దృక్పథంతో స్పందించాలని యువ సైకత శిల్పి మానస కుమార్ సాహు సైకత కళాత్మకంగా పిలుపునిచ్చారు. కేరళలో వరద తాండవం విషాద దృశ్యం ప్రతిబింబించే రీతిలో ఆయన ఆవిష్కరించిన సైకత శిల్పం పూరీ గోల్డెన్ బీచ్ తీరంలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.