సోనియా, రాహుల్ లపై పోటి పెట్టం: సమాజ్ వాదీ | Samajwadi Party may not field candidates against Sonia Gandhi, Rahul Gandhi | Sakshi
Sakshi News home page

సోనియా, రాహుల్ లపై పోటి పెట్టం: సమాజ్ వాదీ

Mar 10 2014 10:22 PM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియా, రాహుల్ లపై పోటి పెట్టం: సమాజ్ వాదీ - Sakshi

సోనియా, రాహుల్ లపై పోటి పెట్టం: సమాజ్ వాదీ

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తమ పార్టీ అభ్యర్థులను రాయ్ బరేలి, అమేథి స్థానాల్లో పోటీకి పెట్టబోమని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తమ పార్టీ అభ్యర్థులను రాయ్ బరేలి, అమేథి స్థానాల్లో పోటీకి పెట్టబోమని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. లక్నో లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ లపై తమ పార్టీ చెందిన అభ్యర్థులను పోటీకి పెట్టమని తెలిపారు. 
 
గతంలో కూడా సోనియా, రాహుల్ లపై పోటీ పెట్టలేదని అఖిలేష్ వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాలకు 78 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గత లోకసభలో సమాజ్ వాదీ పార్టీకి 22 మంది సభ్యులున్నారు. కష్ట కాలంలో యూపీఏకు సమాజ్ వాదీ పార్టీ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement