
భారత్ తిరిగొచ్చిన ప్రధాని మోదీ
తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం భారత్...
న్యూఢిల్లీ: తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం భారత్‌కు తిరిగివచ్చారు. మయన్మార్, ఆస్ట్రేలియాలో పర్యటన తర్వాత ఫిజీలో ఒకరోజు గడిపిన మోదీ.. ఆ దేశ రాజధాని సువా నుంచి 14 గంటల ప్రయాణం అనంతరం ప్రత్యేక విమానంలో ఉదయం 7.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మయన్మార్‌లో తూర్పు ఆసియా, ఆసియాన్-భారత్ సదస్సుతో పాటు జీ-20 సదస్సులో మోదీ పాల్గొన్నారు.
నెహ్రూ తర్వాత ఆస్ట్రేలియాలో, ఇందిరాగాంధీ తర్వాత ఫిజీలో పర్యటించిన ప్రధాని మోదీనే కావడం విశేషం. ఆస్ట్రేలియాలో నాలుగు రోజులపాటు పలు నగరాలను ప్రధాని సందర్శించారు. అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో శిఖరాగ్ర చర్చ లు జరిపారు. ఉగ్రవాదంపై పోరులో అంతర్జాతీయ వ్యూహంతో ముందుకుసాగాల్సిన అవసరముందని మోదీ విదేశీ నేతలకు నొక్కిచెప్పారు.