రజనీతో కలసి పనిచేయడానికి సిద్ధమే

Ready to work with Rajani - Sakshi

సినీ నటుడు కమలహాసన్‌

తమిళసినిమా (చెన్నై): సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలసి పనిచేయడానికి తాను సిద్ధమేనని సినీ నటుడు కమలహాసన్‌ అన్నారు. చెన్నైలో కమలహాసన్‌ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి రాజకీయ సమావేశం సర్‌ప్రైజింగ్‌ గా ఉంటుందని చెప్పారు.

నిజానికి తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అదే విధంగా బీజేపీ తదితర పార్టీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు భావించడం సరికాదన్నారు. రజనీకాంత్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నారని రజనీ, తానూ మంచి మిత్రులమని చెప్పారు. ఇద్దరి రాజకీయపరమైన సిద్ధాంతాలు, అభిప్రాయాలు కలిస్తే రజనీకాంత్‌తో కలసి పని చేయడానికి తాను సిద్ధమేనని కమల్‌ స్పష్టం చేశారు.

Back to Top